తాజాకూరలలో రాజా… వంకాయ సాగు విధానం. | Brinjal/Eggplant Farming

తాజాకూరలలో రాజా… వంకాయ సాగు విధానం. | Brinjal/Eggplant Farming

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా చేసే కూరల్లో ‘వంకాయకూర’ తప్పని సరిగా ఉండాల్సిందే.. ఎన్ని కూరలున్నా వంకాయకూర రుచి వేరు.. అలాంటి వంకాయను సాగు చేసుకుంటే మంచి లాభాలు కూడా వస్తాయి.  జూన్‌ – జులైలో, శీతాకాలపు పంటను అక్టోబరు- నవంబరులో, వేసవి కాలపు పంటను జనవరి రెండవ పక్షం నుంచి ఫిబ్రవరి మొదటి పక్షం వరకు నారు కోసం విత్తుకోవాలి.

నారు ఎప్పుడు నాటాలంటే..
30-35 రోజుల నారును నాటుకోవాలి. వర్షాకాలం నారును జులై- ఆగష్టులో, చలికాలం నారును నవంబరు- డిసెంబరులో, వేసవి కాలం నారును ఫిబ్రవరి- మార్చి మొదటి వారంలో నాటుకోవాలి.
ఇవి.. అనకూలమైన నేలలు..బాగా నీరు ఇంకే నేలలు, ఒక మాదిరి నుంచి హెచ్చు సారవంతమైన నేలలు ఈ పంట సాగుకు అనుకూలమైనవి.

విత్తనం…
ఎకరానికి సూటి రకాలకు 260గ్రా. మరియు సంకరజాతి రకాలకు 120 గ్రాముల విత్తనం కావాలి.

ఎన్నో.. రకాలు
తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా కోస్తా ఆంధ్ర ప్రాంతానికి భాగ్యమతి, పూసాపర్పుల్‌ లాంగ్‌, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, పూసా క్రాంతి, గులాబీ రకాలు, తెలంగాణా ప్రాంతానికి పూసా క్రాంతి, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, శ్యామల రకాలు, రాయలసీమ ప్రాంతానికి దేశవాళీ పచ్చవంగ రకాలు, దేశవాళీ చారల వంగ (రాయదుర్గ) రకాలు అనుకూలం.

సంకరజాతి రకాలు…
ఉదారంగు గుండ్రటి రకాలు :
అర్కసవనీత్‌, పూసా హైబ్రిడ్‌-6, మహికో హైబ్రిడ్‌ నెం.2, నెం.54, ఉత్కర్ష, మోహిని, అగోరా, మంజు, సంజు, మ్యూ-మ్యూ.
ఉదారంగు గుత్తి రకాలు : మహికో- రవయ్య, మహికో హైబ్రిడ్‌ నెం.3.
ఉదారంగు పొడవు రకం : పూసా హైబ్రిడ్‌-5.
పచ్చటి పొడవు రకాలు : మహికో హైబ్రిడ్‌ నెం.9, గ్రీన్‌ లాంగ్‌, హరిత, హర్షిత, బి.హెచ్‌.0028, – 1311, – 1444.పచ్చటి గుండ్రటి రకాలు : మహికో హైబ్రిడ్‌ నెం.56, గ్రీన్‌ మోతి
ఉదారంగు చారల రకాలు : కల్పతరు, మహికో హైబ్రిడ్‌ నెం. 11, 16, విజరునాటే దూరం.

నేలను ఇలా..
నేలను 4-5 సార్లు బాగా దున్ని చదును చేయాలి. వర్షాకాలపు పంటకు బోదెలు, కాలువలు ఏర్పాటు చేయాలి. శీతాకలం మరియు వేసవి పంటకు 4/5 చ.మీ మళ్లను తయారు చేసుకోవాలి.

నారుమడి పెంపకం..
ఆరు అంగుళాల ఎత్తు ఉండే 4/1 మీ., సైజుగల నారుమళ్లను తయారు చేసుకోవాలి. 260 గ్రా. విత్తనాన్ని 10 సెం.మీ వరుసల్లో విత్తుకోవాలి. అయితే విత్తే ముందు విత్తనాలను 50 డిగ్రీల సెల్సియన్‌ ఉష్టోగ్రత గల నీటిలో 30 నిమిషాల పాటు నానబెట్టి, నీడలో ఆరనివ్వాలి. ఆ తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల చొప్పున థైరామ్‌ లేదా మాంకోజెబ్‌ అనే మందుతో విత్తనశుద్ధి చేసుకోవాలి. తర్వాత కిలో విత్తనానికి 4 గ్రా.ల చొప్పున ట్రైకోడెర్మా విరిడి కల్చర్‌ను కూడా పట్టించి విత్తుకోవాలి. విత్తిన తర్వాత మాడుగు తెగులు కనిపించిన వెంటనే (మాడుగు తెగులు వర్షాలు ఎక్కువగా ఉన్నప్పుడు, నీరు మళ్లలో నిలిచినప్పుడు వస్తుంది.) మొక్కల మొదళ్ల వద్ద కుళ్లి నారు చనిపోతుంది. నారు ఏ దశలోనయినా ఈ తెగులు రావచ్చు. కాపర్‌ ఆక్సీక్టోరైడ్‌ మందును లీటరు నీటికి 3 గ్రాముల చొప్పున కలిపి వారం రోజుల వ్యవధి ఇస్తూ 2-3 సార్లు నారుమడిని బాగా తడపాలి. నారును పీకటానికి వారం రోజుల ముందు 250 గ్రా. కార్బొప్యూరాన్‌ గుళికలను 100 చ.మీ నారుమడికి వేయాలి.

నాటే దూరం..
పొడవుగా, నిటారుగా పెరిగే రకాలకు (పూసా పర్పుల్‌ లాంగ్‌, పూసా పర్పుల్‌ క్లస్టర్‌, పూసా పర్పుల్‌ రౌండు, భాగ్యమితి, శ్యామల) 60/60 సెం.మీ గుబురుగా పెరిగే రకాలకు (పూసా క్రాంతి, ఆక్క కుసుమాకర్‌, గులాబీ) 75/50 సెం.మీ దూరంలో నాటాలి.
ఎకరాకు 200 కిలోల చొప్పున వేప పిండిని దుక్కిలో వేసుకోవాలి. బాక్టీరియా ఎండు తెగులు ఉండే ప్రాంతాల్లో ఎకరాకు 6 కిలోల చొప్పున బ్లీచింగ్‌ పొడిని వేసుకోవాలి. రసం పీల్చే పురుగులు రాకుండా ఎకరాకు 10 కిలోల చొప్పున కార్పొప్యూరాన్‌ గుళికలను నాటే ముందు వేసుకోవాలి.

కలుపు నివారణ..
విత్తిన లేదా నాటిన 24-48 గంటలలో అలాక్లోర్‌ 1.0లీ. (తేలిక నేలలు), 1.5 లీటర్లు చొప్పున (బరువు నేలలకు) ఎకరాకు పిచికారి చేయాలి. నాటిని 25, 30 రోజులప్పుడు గొర్రు లేదా గుంటకతో అంతరకృషి చేయాలి. పైపాటు ఎరువులు వేసే ప్రతిసారి గొప్పుత్రవ్వి బోదెలు సరిచేస్తే పంట బాగా పెరుగుతుంది.

నీటి యాజమాన్యం..
నారు నాటే ముందు లేదా నాటిన వెంటనే నీరు పెట్టాలి. భూమిలో తేమను బట్టి శీతాకాలంలో 7-10 రోజులకొకసారి, వేసవిలో 4-5 రోజులకొకసారి, వర్షాకాలంలో అవసరాన్ని బట్టి నీరు ఇవ్వాలి. సాధ్యమైనంత వరకు వేసవిలో నీటి తడులు కాయలు కోయడానికి 1-2 రోజుల ముందు ఇవ్వాలి. లేకుంటే వంకాయలు చేదుగా ఉంటాయి. బరువైన నల్లరేగడి నేలల్లో తప్పనిసరిగా మురుగు నీటి పారుదల సౌకర్యం కల్పించాలి.

Media

ఎరువులు..
ఎకరాకు 2 – 4 టన్నుల KAP Bio Manure ఎరువును ఆఖరి దుక్కిలో వేసి కలియదున్నాలి. 24 కిలోల భాస్వరం (150 కిలోల సూపర్‌ ఫాస్పెట్‌) 24 కిలోల పొటాష్‌లనిచ్చే ఎరువులను (40 కిలోల మ్యూరేట్‌ ఆఫ్‌ పొటాష్‌) చివరి దుక్కిలో వేయాలి. 40కిలోల నత్రజనిని, (200 కిలోల అమ్మోనియం సల్ఫేట్‌ లేదా 85కిలోల యూరియా) మూడు భాగాలుగా చేసి నాటిన 30వ, 60వ మరియు 75వ రోజున పైపాటుగా వేయాలి. సంకరజాతి రకాలకు ఈ ఎరువుల మోతాదు 50 శాతం అధికం చేసి వేయాల్సి ఉంటుంది.

పురుగుకు.. మందు..
పువ్వు, కాయలు తొలుచు పురుగు : నాటిన 30-40 రోజుల నుంచి ఈ పురుగు వస్తుంది. మొక్క పెరుగుల దశలో పువ్యును తర్వాత దశలో కాయలను తొలచి నష్టాన్ని కలుగజేస్తుంది. కాయలు వంకర్లు తిరిగిపోతాయి. కొమ్ముల చివర్ల పెరుగుదల ఆగిపోతుంది. దీని నివారణకు పురుగు వచ్చిన కొమ్మల చివర్లు తుంచి వేసి నాశనం చేసి కార్బరిల్‌ 50శాతం డబ్ల్యూ.పీ 3 గ్రా. లేదా ప్రొఫెనోఫాస్‌ 2 మి.లీ లేదా సైపర్‌ మెత్రిన్‌ 1. మి.లీ లీటరు నీటిలో కలిపి 10 రోజుల వ్యవధిలో కాయలు కోసిన తర్వాత పిచికారీ చేయాలి.

రసం పీల్చే పురుగులు (దీపపు పురుగులు, పేనుబంక, తెల్లదోమ) : ఆకుల అడుగు భాగాన చేరి రసాన్ని పీల్చివేయటం వల్ల ఆకులు పసుపురంగుకు మారి పైకి ముడుచుకుని ఎండిపోతాయి. వీటి నివారణకు డైమిథోయేట్‌ లేదా మిథైల్‌డెమెటాన్‌ లేదా ఫిప్రొనిల్‌ లీటరు నీటికి 2 మి.లీ చొప్పున కలిపి పిచికారి చేయాలి. తెల్లదోమ అధికంగా ఉన్న ఎడల ఎసిఫేట్‌ 1.5 గ్రా. చొప్పున లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.

Media

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.