అధిక లాభాల పంట, మన డ్రాగన్ ఫ్రూట్ | Dragon Fruit Farming

అధిక లాభాల పంట, మన డ్రాగన్ ఫ్రూట్ | Dragon Fruit Farming

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

డ్రాగన్ ఫ్రూట్ ని మామూలుగా కాక్టస్ జాతికి చెందిన పాకుతూ పెరిగే గుణమున్న మొక్క. ఈ మొక్కలు దక్షిణ అమెరికాలో పుట్టిన ప్పటికీ ఉష్ణమండల వాతావరణ పరి స్థితులను కలిగి ఉన్నా అన్ని దేశాల్లో పెరుగుతుంది .

ఈ మొక్కలు త్వరితంగా పెరిగే గుణాన్ని కలిగి ఉండటం వల్ల , ఇవి పైకి పాకడానికి ఒక ఆధారం ( పోల్ లేదా స్తంభం ) ఉండి , పైన మొక్క అల్లుకు పోవడానికి ఏదైనా గుండ్రటి లేదా దీర్ఘచతురస్రాకారపు ప్రదేశాన్ని అమర్చినట్లయితే గొడుగులాగా అల్లు కుపోతుంది .

ఇందులో రంగుని బట్టి ముఖ్యంగా 3 రకాలున్నాయి, అవి :

1 ) పింక్ రంగు పండ్లు : తెలుపు కండ కలిగి ఉంటాయి
2 ) పింక్ రంగు పండ్లు : ఎరుపు కండ కల్గినవి
3 ) పసుపు రంగు పండ్లు : తెలుపు కండ ఉన్నటువంటివి .

సాగు విధానం

వాతావరణం : ఈ మొక్కల పెరుగుదలకు సాధా రణంగా 50 సెం.మీ. సం || పు వర్ష పాతం ఉంటే సరిపోతుంది . 20-30 డి . సెం.గ్రే . ఉష్ణోగ్ర తలు ఈ పంట పెరుగుదల , అభివృ ద్ధికి అనుకూలంగా ఉంటాయి .

Alt Text

నేలలు :
డ్రాగన్ ఫ్రూట్ అన్ని రకాల నేలల్లో పెరిగే స్వభావం కలిగి ఉంటుంది . ముఖ్యంగా మురుగునీటి సౌకర్యం గల నేలలు చాలా వరకు అనుకూ లంగా ఉంటాయి . ఎర్ర గరప , ఇసుక నేలలు , సేంద్రియ పదార్ధం గల నేలలు చాలా వరకు వీటి సాగుకు అనువుగా ఉంటాయి . ఉదజని సూచిక 5.5-6.5 గా ఉండేలా చూసు కోవాలి .

నేలతయారీ :
ఈ పంట సాగులో కలుపు నివారణ చాలా ముఖ్యమైనది . కలుపు మొక్కలు మొత్తం వేర్ల నుంచి తొలగి పోయే విధంగా నేల వదులుగా అయ్యేంత వరకు దున్నుకోవాలి . నేల తయారీ సమయంలోనే KAP Bio Manure ను దుక్కిలో వేసి కలియ దున్నాలి .

నాటే దూరం :
డ్రాగన్ ఫ్రూట్ మొక్కలు ఎగబా కుతూ పెరిగే గుణమున్న మొక్కలు కాబట్టి వీటికి ఊతమివ్వడం తప్పని సరి . వీటి సపోర్ట్ కొరకు కాంక్రీటు స్తంభాలు , వెదురు స్తంభాలు , గోడలు , ఏపుగా పెరిగే చెట్లను ఉపయోగించ వచ్చు . ఈ మొక్కలు 20 సం || ల వరకు కాపునిస్తాయి . మొదటి 3-4 సం || ల వయస్సు గల మొక్కలు దాదాపుగా 100 కిలోల బరువు కలిగి ఉంటాయి . కాబట్టి వాటిని మోయగ లిగే శక్తి గల దృఢమైన ఆధారాలను ( స్తంభాలను ) ఎన్నుకోవాలి . కాంక్రీటు ఇలా స్తంభాలను ఎన్నుకుంటే ఎక్కువ కాలం ఉండి పాడవకుండా మొక్క లకు సరైన ఆధారాన్ని ఇస్తాయి .

మొక్కలు నాటుట :
అన్ని పండ్ల మొక్కల్లాగే ముందుగా తయారు చేసిన గుంతల్లో ఈ మొక్కలను నాటాలి . 30 సెం . మీ . లోతు , 20 సెం.మీ. వెడల్పు కలి గిన గుంతల్లో వీటిని నాటాలి . గుంతలు తీస్తున్న సమయంలోనే గుంతలోని పక్క భాగాన్ని కూడా కొంచెం వదులు చేసినట్లయితే మొక్కల వేరు వ్యవస్థ బాగా అభి వృద్ధి చేసేందుకు వీలుంటుంది . మొక్కలు నాటడానికి ముందుగానే , ఏర్పాటు చేసిన స్తంభాలను సరిగా గుంత మధ్యలో పాతాలి . చేయడం వల్ల మొక్కలు పైకి ఎగబా కడానికి అనుకూలంగా ఉంటాయి . ఒక ఎకరానికి 1700 మొక్కలు నాట డానికి ఆస్కారముంటుంది . మొక్కలు సరిగ్గా పైకి ఎగబాకడానికి స్తంభం దగ్గరగా నాటుకోవాలి . 1 నుంచి 4 మొక్కలను ఒక స్తంభం దగ్గర నాటుకోవచ్చు . సాధారణంగా నీటి లభ్యత తక్కువున్న ప్రదేశాల్లో మాత్రం 2-3 మొక్కల్ని నాటవచ్చు తొలకరి జల్లులు కురిసే సమయాల్లో నాటుకోవడం మంచిది . మొక్కకు మొక్కకు మధ్య 2X2 లేదా 3X3 మీ . దూరంలో సాయంత్రం గాని , ఉదయం పూట గాని నాటుకోవాలి .

Media

నీటి యాజమాన్యం :
ఈ పండ్ల మొక్కల వేరు వ్యవస్థ 15-30 సెం.మీ , లోతు వరకు వ్యాపి స్తాయి . ఈ మొక్కలకు కావాల్సిన సాధారణ వర్షపాతం 1,145-2540 మి.మీ. / సం.నికి వర్షపాతం తక్కువగా ఉన్నప్పుడు నీటి తడులివ్వడం చాలా ముఖ్యమైనది . ఇవ్వాల్సిన మోతాదు కంటే ఎక్కువగా ఇస్తే బాక్టీ రియా , ఫంగస్ వ్యాధులు , తక్కువుగా ఇస్తే పండ్ల ఉత్పత్తి అనేది సరిగా ఉండదు . అందుకోసమని నేలలో తగి నంత తేమశాతం ఉండేలా చర్యలు చేపట్టాలి . డ్రిప్ పద్ధతి పాటిస్తే , నీటి లభ్యత తక్కువున్న ప్రదేశాల్లో నీటిని తగినంతగా మొక్కలకు అందించ -వచ్చు . దీంతో పాటు మల్చింగ్ విధా కూడా ఆచరిస్తే రైతులు మంచి ఆదాయాన్ని పొందవచ్చు .

ఎరువుల యాజమాన్యం :
ఎరువులు ఈ మొక్కల పెరుగుద లలో కీలక పాత్ర పోషిస్తాయి . సేం ద్రియ పదార్ధం గల ఎరువులను మొక్కలకు అందిస్తే వాటి పెరుగు దల , అభివృద్ధి మెరుగ్గా ఉంటుంది . ప్రతి మొక్కకు 10-15 కిలోల పశు -వుల ఎరువు / KAP Bio Manure  అందించాలి . దాని తర్వాత సేంద్రియ ఎరువుల మోతాదును 2 కిలోల చొప్పున ఒక మొక్కకు ప్రతి ఏటా ఇవ్వాల్సి ఉంటుంది . శాఖీయోత్పత్తి కొరకు 40:90:70 గ్రా . ప్రతి మొక్కకు , మ్యూరేట్ ఆఫ్ పొటాష్ , సూపర్ ఫాస్ఫేట్ , యూరియాను , ఎక్కువ మోతాదు పొటాష్ ఎరువు లను వాడటం వల్ల దిగుబడి పెరిగే అవకాశాలుంటాయి . వీటిని మూడు దశల్లో ఇవ్వాలి . అవి .

1 ) పూత సమయం కంటే ముందు . ఏప్రిల్
2 ) ఫలం అభివృద్ధి దశలో – జులై ఆగస్టు
3 ) పండ్ల కోతానంతరం – డిసెంబరు యూరియా – 50 గ్రా . ! మొక్కకు సూపర్ ఫాస్ఫేట్ -50 గ్రా . / మొక్కకు మ్యూరెట్ ఆఫ్ పొటాష్- 100 గ్రా . / మొక్కకు వీటి మోతాదులను 200 గ్రా . వరకు ప్రతి ఏటా పెంచుతూ ఒకటిన్నర కిలోల వరకు ఇవ్వాలి

పంటకోత :
* ఈ మొక్కలు నాటిన ఏడాదిలోపే పూతకు వచ్చి పండ్లనిస్తాయి .
* సాధారణంగా ఈ మొక్కలు మే జూన్ నెలలో పూతకు వచ్చి ఆగస్టు నుంచి డిసెంబర్ నెల వరకు ఫలాల్ని ఇస్తాయి .
* పూత మొదలైన ఒక నెల నుంచి పండ్లను కోయడానికి వీలుంటుంది . డిసెంబరు నెల మొత్తం పండ్ల అభి వృద్ధి ఉండటం వల్ల , ఈ నెలలోనే ఆరుసార్లు పంటను కోయడానికి ఆస్కారముంటుంది . * పండ్లు పచ్చరంగు నుంచి పింక్ రంగుకు మారగానే పంటకోత మొదలు పెట్టడానికి వచ్చిందని గుర్తించి , కోతని మొదలు పెట్టవచ్చు .
* ఇలా రంగులో మార్పులు గమ నించిన 3 నుంచి 4 రోజుల్లో పే పంటను కోయాలి .

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.