జీవామృతం తయారీ విధానం

జీవామృతం తయారీ విధానం

Alt Text

KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .

Alt Text

Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial

Phone: 9959171939 | +91 40 40025505
[email protected]

Alt Text

రసాయనిక వ్యవసాయం వల్ల భూమిలో సూక్ష్మజీవరాశి, సేంద్రియ పదార్థం నశించి పొలాలు నిస్సారమైపోయాయి. ఈ దశలో భూమిని తిరిగి సారవంతం చేయడం అత్యవసరం. అందుకు  ‘జీవామృతం’ చక్కగా ఉపయోగపడుతుంది. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో పంటలను సాగు చేయటం ద్వారా మనుషుల ఆరోగ్యంతోపాటు భూమి, పర్యావరణం, పశుపక్ష్యాదుల ఆరోగ్యం కూడా కుదుట పడుతుందని ఇప్పటికే రుజువైన విషయం. తెలంగాణ లో ప్రభుత్వ ప్రకృతి వ్యవసాయ విభాగం జీవామృతాన్ని అందుబాటులో ఉన్న వనరులతోనే తయారు చేసుకోవటంతోపాటు, పంటలకు జీవామృతాన్ని వాడుకునే పద్ధతులను రైతులకు సూచిస్తోంది.

జీవామృతం తయారీకి కావలసిన పదార్ధాలు

1) తాజా ఆవుపేడ – 10 కేజీలు
2) దేశీ ఆవు మూత్రం – 5 నుండి 10 లీటర్లు
3) బెల్లం – 2 కేజీలు (నల్ల బెల్లం అయితే మరీ మంచిది) లేదా చెరుకు రసం 2 లీటర్లు
4) పప్పుల (ద్విదళాల) పిండి – 2 కేజీలు (శనగ, ఉలవ, పెసర, మినుము ఏదైనా వాడవచ్చు. వేరుశనగ, సోయా పిండి మాత్రం వాడకూడదు)
5) బావి/బోరు/నది నీరు – 200 లీటర్లు
6) పుట్ట మన్ను లేదా పొలంగట్టు మన్ను దోసెడు.


 

జీవామృతం వాడే పద్ధతులు

నీటి తడులతో పారించటం: వరి, మొక్కజొన్న, చెరకు తదితర పంటలకు నీటి తడులను అందించేటప్పుడు నీటితో పాటుగా జీవామృతాన్ని ఎకరాకు ఒక దఫా 200 లీటర్లు చొప్పున అందిస్తున్నారు. పంటల వివిధ దశల్లో 3 నుండి 4 సార్లు నీటితోపాటు పారిస్తున్నారు

పిచికారీ పద్ధతి: వరి, మొక్కజొన్న, కూరగాయలు తదితర పంటలకు జీవామృతాన్ని బాగా వడగట్టి, నీటితో పాటుగా ఎకరాకు ఒక దఫాకు 200 లీటర్లు పంటల వివిధ దశల్లో 3 నుంచి 4 సార్లు రైతులు పొలాల్లో పిచికారీ చేస్తున్నారు.

ఏ యే పంటలకు ఎంత?

వరి, మొక్కజొన్న, వేరుసెనగ, కూరగాయ పంటలకు నీరు పారించే సమయంలో నీటితో కలిపి పారేలా చేసి పొలం మొత్తానికి జీవామృతం అందేలా చేయాలి. ప్రతి 15 రోజులకు ఒకసారి 200 లీటర్ల జీవామృతాన్ని నీటితోపాటు భూమికి అందించాలి. అలాగే పండ్ల తోటల్లో ఒక సంవత్సరం వయసున్న మొక్కకు అర లీటరు చొప్పున, రెండు సంవత్సరం మొక్కలకు ఒక లీటరు చొప్పున.. ప్రతి 15 రోజులకు ఒకసారి నేలకు అందించాలి. తద్వారా భూమిలో సుక్ష్మజీవరాశి పెంపొంది, నేల ఆరోగ్యవంతమవుతుంది. ఆరోగ్యవంతమైన భూమి మొక్కలకు సకల పోషకాలను అందిస్తుంది. (Courtesy: Sakshi News)

Alt Text

జీవామృతాన్ని తయారు చేసే విధానం

ఎండ తగలని చోట పెట్టిన సిమెంటు తొట్టి లేదా ప్లాస్టిక్ పీపాలో 200 లీటర్ల నీటిని నింపాలి.  పేడ, మూత్రం, బెల్లం, పిండి తదితరాలను అందులో వేసి బాగా కలపాలి. గడియారం ముల్లు తిరిగే దిశగా అంటే సవ్యదిశలో కర్రతో కలియతిప్పాలి. గోనె సంచి కప్పాలి. ఉదయం ఒక నిమిషం, సాయంత్రం ఒక నిమిషం కలియ తిప్పుతూ ఉండాలి. అందులోని సూక్ష్మజీవరాశి ప్రతి 20 నిమిషాలకోసారి రెట్టింపు అవుతూ ఉంటుంది. 48 గంటల తర్వాత వాడకానికి జీవామృతం సిద్ధమవుతుంది. అప్పటి నుంచి వారం రోజుల్లోగా ఉపయోగించాలి. ఎకరానికి 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 15 రోజులకోసారి సాగు నీటితో పాటు వాడాలి లేదా భూమిలో పదునుంటే నేరుగా చల్లాలి. జీవామృతాన్ని అన్ని పంట పొలాల్లోనూ వాడవచ్చు.. పంటలపైన పిచికారీ చేయొచ్చు.

Alt Text

About KAP Bio Manure

KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,

Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.

Bio Manure - Speciality

It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micro-nutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.

Product - Advantages

Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.