సేంద్రియ వ్యవసాయం మన తక్షణ కర్తవ్యం
KAP Associates వారు అందిస్తున్న , అధిక పోషక విలువలు కల్గిన కార్బన్ సేంద్రియ ఎరువు (KAP N-Riched Bio Manure) ఇప్పుడు, రైతులకు అందుబాటు ధరలో దొరుకుతుంది. పూర్తి వివరాలకు, bulk orders కోసం సంప్రదించండి : శ్రీనివాస్ – 9959171939 .
Monday, March 14, 2022
www.kapassociates.in | @kapassociatesofficial
Phone: 9959171939 | +91 40 40025505
[email protected]
రసాయనాలతో వ్యవసాయం వల్ల కలిగే దుష్పరిమాణాలఫై ప్రపంచ వ్యాప్తంగా ఇప్పుడు చర్చ జరుగుతోంది. సురక్షిత ఆహారపదార్థాల వినియోగానికి అన్ని వర్గాల ప్రజలు ఆసక్తి చూపుతున్నారు. రైతులు సైతం సేంద్రియ సాగు దిశగా అడుగులు వెయ్యటం ఎంతో శుభ పరిణామం. ఈ నేపథ్యంలో ప్రస్తుత సేంద్రియ సాగుఫై ప్రత్యేక కథనం.
స్వాతంత్రం తరవాత, హరిత విప్లవంతో దిగుబడులు గణనీయంగా పెరిగినప్పటికీ, అధిక రసాయనాల వాడకం తో కొన్ని దుష్పరిమాణాలు సంభవిస్తున్నాయి. 1950- 51 లో రసాయన ఎరువులు వాడకం 66 వేల టన్నులగా ఉండగా, ఇప్పుడది సుమారు 2 కోట్ల టన్నులకు పెరిగింది. విచక్షణరహితంగా రసాయనాల వాడకంతో, చీడపీడల్లో రసాయనాలను తట్టుకునే శక్తి పెరగడమే కాకుండా మిత్ర పురుగులు సంఖ్య తగ్గుతుంది. పర్యావరణ కాలుష్యంతో పాటు సస్యరక్షణ ఖర్చు పెరుగుతుంది. వ్యవసాయ ఉత్పత్తుల్లో రసాయన అవశేషాలు ప్రమాద స్థాయికి చేరుకుని, మనుషులతో పాటు పశుపక్షాదుల్లో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. క్రమేపీ, నేల సారం క్షీణించి పంటల్లో పోషక లోపాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా సూక్ష్మ, ద్వితీయ పోషకాలు లోపించడం వల్ల ఉత్పత్తిలో స్తబ్దత నెలకొంటుంది. ఈ నేపథ్యంలో, సేంద్రీయ వ్యవసాయం ప్రాధాన్యం సంతరించుకుంది. వాతావరణ కాలుష్యాన్ని నివారిస్తూ, నేల ఆరోగ్యాన్ని కాపాడుతూ నాణ్యమైన అధిక దిగుబడులు సాధించడమే సేంద్రియ వ్యవసాయం ముఖ్య ఉద్దేశం. సేంద్రీయ ఎరువులతో పాటు నాణ్యమైన విత్తనాల ఎంపిక, రోగాలను తట్టుకునే విత్తన రకాలు వాడటం, లోతు దుక్కి, సరైన సమయంలో విత్తడం, నీటి యాజమాన్యం, సమగ్ర పోషక యాజమాన్యం, అంతర పంటలు, పంట మార్పిడి, చీడపీడల నివారణకు వృక్ష సంబంధ పదార్థాల వాడకం వంటి మేలైన యాజమాన్య పద్ధతులు అవలంబించటం ద్వారా సుస్థిర దిగుబడులు సాధించవచ్చు.
సేంద్రియ సాగు పద్ధతులు
ఇందులో రెండు ప్రధాన పద్ధతులు ఉన్నాయి. మొదటి పద్ధతిలో పశువుల పేడ, ఎండిన లేదా పచ్చి ఆకులు, వర్మీ కంపోస్ట్, సిటీ కంపోస్టు, వేప పిండి వంటి పకృతిసిద్ధ ఎరువులు వాడి పంటలు పండించడం. ఇది సాధారణ పద్ధతి. ఇక రెండో పద్ధతి గోఆధారిత పద్ధతి లేదా సుభాష్ పాలేకర్ పద్ధతి అంటారు. ఈ పద్ధతిలో జీవామృతం తో పాటు నీమాస్త్రం, బ్రహ్మాస్త్రం, అగ్నిఅస్త్రం వంటి సహజ రసాయనాలను వినియోగిస్తారు.
ముఖ్య అంశాలు.
సేంద్రియ ఎరువులు వాడకం తో నేలలో సేంద్రియ పదార్థం పెరిగి, భూసారం వృద్ధి చెందుతుంది. నేల భౌతికలక్షణాలు మెరుగుపడతాయి. నేలలోకి నీరు బాగా ఇంకుతుంది. ఇసుక నేలలో నీటినిల్వ శక్తి పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల వాడకం వలన ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మ పోషకాలు కూడా మొక్కలకి అందుతాయి. (Courtesy: Annadatha)
అందుబాటులో ఉన్న సేంద్రియ ఎరువులు
అధిక మోతాదు ఎరువులు: ఈ ఎరువులను అధిక మోతాదులో వెయ్యాల్సివుంటుంది. పోషకాల చాలా తక్కువ స్థాయిలో ఉన్నప్పటికీ వీటితో అనేక లాభాలు ఉన్నాయి. ఇవి భూమి ఉత్పాదకత శక్తిని పెంచుతాయి. వీటిలో పశువుల ఎరువు, సిటీ కంపోస్ట్, వర్మీ కంపోస్ట్, కోళ్ల పెంట, గొర్రెల పెంట పచ్చిరొట్ట ఎరువులు ప్రధానమైనవి.
చిన్న, సన్నకారు రైతులు విరివిగా వాడే సేంద్రియ ఎరువులలో పశువుల ఎరువు ముఖ్యమైనది. రైతుల పశువుల పేడ, పశువుల మూత్రం, గడ్డి వంటివి..పశువుల కొట్టం కి దగ్గరగా సరిపడే గొయ్యి తవ్వి ఫై వాటితో కంపోస్ట్ గా తయారుచేసి ఎరువుగా వాడతారు. నేలకి త్వరితిగతిన సారం అందించడానికి పచ్చిరొట్ట ఎరువుల వాడకం మంచి పద్ధతి.
వానపాములను పెంచి వ్యర్థ పదార్థాలత్తో తయారు చేసిన కంపోస్టును వెర్మికంపోస్టు అని అంటారు. ఈ ఎరువులో ప్రధాన పోషకాలతో పాటు, సూక్ష్మ పోషకాలు పశువుల ఎరువుకన్న దాదాపు 50 శాతం అధికంగా ఉంటాయి. వీటికి తోడు వర్మీ కంపోస్ట్ లో మొక్కల పెరుగుదలకు ఉపయోగపడే సేంద్రియ రసాయనాలు ఉంటాయి.
కోళ్ల ఫారాలున్న చోట కోళ్ల ఎరువును కూడా సేంద్రియ ఎరువుగా వాడవచ్చు. కోళ్ల ఎరువుకు టన్నుకు 10 కిలోలు సూపర్ ఫాస్ఫేట్ కలిపిన తరవాత పొలానికి వేసుకోవాలి. షుగర్ ఫ్యాక్టరీ నుంచి వచ్చిన ఫిల్టర్ మడ్డిని కూడా మేలైన సేంద్రియ ఎరువుగా వాడవచ్చు.
సేంద్రియ ఎరువుల ప్రయోజనాలు.
సేంద్రియ సేద్యం వల్ల నేల ఆరోగ్యం మెరుగుపడుతుంది. నేలలు గుల్లబారి తేమ, గాలి అందుబాటు పెరుగుతుంది. నేల పునరుద్ధరణ మెరుగవుతుంది. నేలలో పోషకాలు, తేమ గుణం పెరుగుతుంది. పోషకాల వినియోగ సామర్థ్యం పెరుగుతుంది. నీరు, వ్యవసాయ ఉత్పత్తులు కాలుష్యానికి గురి కావు. సహజ వనరులు సద్వినియోగం అవుతాయి. నేల సహజ లక్షణాలలో వచ్చే మార్పులతో సామర్థ్యం పెరుగుతుంది. నేలలో సేంద్రియ పదార్థం పెరుగుతుంది తద్వారా, పంటలకు మేలు చేసే సూక్ష్మ జీవులు, కీటకాలు వృద్ధి చెందుతాయి. ఆరోగ్యకరమైన, విషరహిత, నాణ్యమైన పంటలు చేతికందుతాయి.
సేంద్రియ ఎరువుల్లో పోషకాల శాతం
About KAP Bio Manure
KAP Associates, which specializes in marketing food, commodity and agro-based products,
Offers their product KAP N-Riched Bio Manure (organic fertilizer) with the highest quality standards, at a lower price than any other organic fertilizer currently available in the market.
KAP N-Riched Bio Manure is designed to re-stabilize the soil that has lost its fertility due to the excessive use of chemical fertilizers and to keep the nutrients such as nitrogen, phosphorus and potassium in balance and to give the soil a C: N ratio of not more than 20.
Bio Manure - Speciality
It is a highly natural fermented, ready-to-use fertilizer with organic matter.
Availability of organic carbon, nitrogen, phosphorus, potassium and micronutrients required for the crop.
Moisture percentage balance in the fertilizer.
Product - Advantages
Apart from nutrients like nitrogen, potash and phosphorus, the crop also gets micronutrients like calcium, magnesium, boron, zinc and manganese.
The use of chemical fertilizers like urea, DAP, potash will be reduced.
Increases crop resistance to pests. Therefore the cost of pesticides is greatly reduced.
Using our fertilizer will use less water for the crop and save water.
Soil erosion is less due to the adhesive substances in our manure holding the soil.
Increases the number of microorganisms that fertilize the soil, Thus the earth receives organic carbon.